వైయస్ జగన్‌కు కడప జిల్లా కలెక్టర్ సహకారం: దాడి వీరభద్రారావు
State
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
కడప: కడపకు పంపిన 40 మంది డిఎస్పీలను కడప జిల్లా కలెక్టర్ వెనక్కి పంపడాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సమర్థించడాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ఆదివారం విలేకరుల సమావేశంలో ఖండించారు. కడప జిల్లా కలెక్టర్ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీకి చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. డిఎస్పీలను వెనక్కి పంపిన వైనాన్ని ఎందుకు సమర్థిస్తున్నారో భన్వర్‌లాల్ చెప్పాలని అన్నారు.
ఎన్నికల శాంతిభద్రతల మధ్య జరగాలనే ఉద్దేశ్యంతో డిజిపి పంపిన డిఎస్పీలను వెనక్కి పంపించడం సరికాదన్నారు. అది పోలీసు శాఖను అవమానించడమే అన్నారు. ఎన్నికల సంఘం చెప్పినట్టు వెబ్ కెమెరాలు ఎక్కడా పని చేయడం లేదన్నారు. ఓటింగ్ సరళిని పరిశీలించవలసిన అవసరం ఈసికి ఉందన్నారు. ఎన్నికలు సజావుగా జరగక పోవడానికి కారణం బాధ్యుడు కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తించడం లేదన్నారు.