చిన్న భార్య అమల్ అహ్మద్ అబ్దుల్ ఫతాను లాడెన్ ఎలా పొందాడు?

టీనేజీలో ఉన్నప్పుడే ఫతాతో లాడెన్ వివాహం జరిపించడానికి తాను సహాయ పడ్డానని షేక్ రషాద్ ఎబిసి న్యూస్‌తో చెప్పాడు. ప్రస్తుతం ఫతా వయస్సు 29 ఏళ్లు కాగా, లాడెన్ వయస్సు 54 ఏళ్లు. లాడెన్ పట్ల ఫతా వివాహ సమయంలో ఏ విధమైన ఫిర్యాదు చేయలేదని రషాద్ చెప్పాడు.
ఫతాతో పాటు మరో ఇద్దరు భార్యలు లాడెన్ ఏం కావాలన్నా వ్యతిరేకించకుండా చేసేవారని బేర్‌ఫుట్ ఇన్ బగ్దాద్ పుస్తక రచయిత, ఇస్లాంలో మహిళ పాత్రపై నిపుణుడు మనాల్ ఒమర్ చెప్పారు. లాడెన్‌పై దాడి జరిగినప్పుడు ఆ ముగ్గురు కూడా ఆవరణలోనే ఉన్నారు. పురుష నాయకుడు లేదా భరత్ కోరికలను తీర్చడమే ముస్లిం మహిళల విధిగా ఉంటుందని ఒమర్ అన్నారు.












Click it and Unblock the Notifications