కోదండరామ్ టిఆర్ఎస్ ఏజెంట్, తెలంగాణపై బాబుకు చెప్పా: నాగం

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ టిఆర్ఎస్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నగారాకు కోదండరామ్ రాకపోవడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా సభను నిర్వహిస్తే కోదండరమ్ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఆయన టిఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను అందరిపై రుద్దాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ కోసం టిఆర్ఎస్ వాళ్లు వచ్చి ఎక్కడ పోరాటం చేస్తున్నారన్నారు. పార్టీ బయటకు వచ్చి పోరాటం చేయాలని కోదండరామ్ తనకు సూచించడాన్ని ఆయన ఖండించారు. పార్టీలో ఉంటూ పోరాటం చేయవద్దా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications