నాగం భేష్, జూపల్లి బేజార్: తెలంగాణపై పట్టుకు ప్రయత్నాలు

పార్టీ అనుమతి లేకుండానే ఆయన తెలంగాణ ఉద్యమం సాగిస్తున్నారు. అయితే పార్టీ దీనిని అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ పరిస్థితుల దృష్ట్యా బహిర్గతంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. అంతేకాదు నాగం ఉద్యమానికి పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి వారు కూడా నాగం మా నేతే కానీ ఆయన కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పి తమ మద్దతు ఉందని అయిష్టంగానైనా చెప్పకనే చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా పార్టీ, పలువురి ఎమ్మెల్యేల మద్దతు, ప్రజాసంఘాల మద్దతుకు తోడు నాగం ఉద్యమానకి ప్రజా మద్దతు కూడా భారీగానే ఉంది. అదే సమయంలో జూపల్లి ఉద్యమానికి మొదట పార్టీ మద్దతు కరువైంది.
జూపల్లి పాదయాత్ర ప్రారంభించిన ప్రారంభంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపినప్పటికీ ఆ తర్వాత ఎవరి నుండి మద్దతు లేదు. ఆయన పాదయాత్రలో కేవలం స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. నాగంకు అనుకూలంగా పలువురు టిడిపి నేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. కానీ జూపల్లికి మాత్రం ఎవరూ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఇష్టంగానో, అయిష్టంగానో పార్టీ నుండి, ఎమ్మెల్యేలు, ప్రజల నుండి నాగంకు మద్దతు లభిస్తుండగా, జూపల్లికి మాత్రం ఆ స్థాయి మద్దతు లభించక పోవడం విశేషం. అయితే కేవలం టిఆర్ఎస్, తెలంగాణ జెఏసి మాత్రం వారు పార్టీ జెండాలు వదిలి వస్తేనే మద్దతు పలుకుతామని ఇరువురికి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications