మీ పార్టీ జెండాలూ పెడతాను: చంద్రబాబుకు నాగం సమాధానం

అయితే చంద్రబాబునాయుడు దీనిపై నాగంను ప్రశ్నించారంట. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభలో పార్టీ జెండాలు ఎందుకు పెట్టలేదని బాబు నాగంను ప్రశ్నించారు. దీనికి తాను పసుపు రంగు జెండాలో పెట్టినట్టు చెప్పారు. అయితే పసుపు రంగు జెండాలు మాత్రమే కాకుండా పార్టీ జెండాలు పెడితే బావుండేదని బాబు అభిప్రాయపడ్డారు. దానికి నాగం విచిత్రంగా సమాధానం చెప్పారంట. సరే ఇక నుండి మీ పార్టీ జెండా పెడతానని చెప్పినట్టు సమాచారం. దానికి బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మీ జెండా మా జెండా ఏమిటి అని ప్రశ్నించడంతో నాగం వెంటనే క్షమాపణలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే నాగం తీరుపై చంద్రబాబులో తీవ్ర అసహనం కలిగించిందంట.












Click it and Unblock the Notifications