ఇదేనా యుపి సిఎం మాయావతి తీరు, ఆగడాలు అడ్డుకోవాలి!: డిఎస్

రాహుల్ గాంధీ తనకున్న ప్రాణహాని దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాయావతి నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్నారు. ఆమె ఆగడాలను అడ్డుకోవాలన్నారు. మాయావతి రైతుల సంరక్షణ కూడా మరిచారని అన్నారు. రాష్ట్ర రైతాంగానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. రాహుల్ పోరాటానికి పిసిసి మద్దతు ఉంటుందని చెప్పారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మాయావతి తీరుకు నిరసనగా కాంగ్రెసు పార్టీ ఆందోళనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్ ముందు మాయావతి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాయావతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications