చంద్రబాబుపై నాగం మళ్లీ ధిక్కారం, పార్టీ జెండా పెట్టేందుకు షరతు

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదీన పరిగిలో జరిగే తెలంగాణ నగారా సభలో కూడా పార్టీ జెండా పెట్టబోమని, తెలంగాణ ఉద్యమ జెండాను మాత్రమే పెడతామని ఆయన చెప్పారు. పార్టీ జెండా పెట్టాలని అడుగుతున్న నాయకులు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు చేత లేఖ ఇప్పించాలని ఆయన అన్నారు. పార్టీలో తెలంగాణ సమన్వయ కమిటీ పెట్టాలనే ప్రతిపాదనను ఆయన ఎద్దేవా చేశారు. సమన్వయ కమిటీ అంటే ఏమిటో అర్థం కావడం లేదని, అందులో ఎవరెవరు ఉంటారో తెలియడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications