కోదండరామ్‌పై విరుచుకుపడిన తెలుగుదేశం నేత నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జెఎసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) యాక్షన్ కమిటీగా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామా చేస్తేనే నమ్ముతామని చెప్పడానికి కోదండరామ్ ఎవరని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. సీమాంధ్ర నాయకులంతా సమైక్యంగా పనిచేస్తుంటే, తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం కలిసి పనిచేయడానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. పార్టీ జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టి తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పిన కోదండరామ్ ఇప్పుడు రాజీనామా చేస్తేనే నమ్ముతామని అనడం సరి కాదని ఆయన అన్నారు.

తాము రాజీనామాలు చేసి ఏం చేయాలో చెప్పాలని ఆయన కోదండరామ్‌ను అడిగారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామాలు చేస్తామని, మిగతా రాజకీయ పార్టీలవారితో కోదండరామ్ రాజీనామాలు చేయించాలని ఆయన అన్నారు. అన్ని పార్టీలు పోయి తమ పార్టీ మాత్రమే ఉండాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అంటున్నారని, అందుకు కోదండరామ్ సహకరిస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్, తెలంగాణ జెఎసి తీరు చూస్తుంటే శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయం అమలవుతోందని అనిపిస్తోందని ఆయన అన్నారు.

పార్టీల్లో ఉండి ఉద్యమాలు చేయకూడదా అని ఆయన అడిగారు. తెల్ల జెండాతో తాము తెలంగాణ ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ సానుకూల ప్రకటన చేసే వరకు తాము తెలంగాణ జెండాతోనే ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. పరిగి సభ కూడా తెలంగాణ జెండాపైనే జరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ అనుకూలంగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తేనే తాము సభల్లో పార్టీ జెండా పెడతామని ఆయన చెప్పారు. తెలంగాణ జెఎసి, తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఓ పార్టీకి అనుబంధంగా పని చేయకూడదని, ఉద్యమానికి అనుబంధంగా పనిచేయాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+