ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ స్థావరంలో పోర్న్ వీడియోలు

Osama Bin Laden
వాషింగ్టన్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ అశ్రయం పొందిన పాకిస్తాన్‌లోని అబ్బొత్తాబాద్ భవనం ఆవరణలో పోర్న్ వీడియోలు లభించినట్లు అమెరికా అధికారులు చెప్పారు. లాడెన్ ఆవరణలో కనిపించిన వీడియోలు ఆధునికమైనవి ఉన్నాయని, ఎలక్ట్రానిక్ రికార్డు వీడియోలు కూడా ఉన్నాయని వారు చెప్పారు. ఆవరణలో ఎక్కడ ఈ వీడియోలు కనిపించాయి, వాటిని ఎవరు చూసేవారనేది తెలియదని అన్నారు. లాడెన్ వాటిని సేకరించి చూసేవాడా అనేది కచ్చితంగా చెప్పలేమని అన్నారు.

లాడెన్ భవనానికి ఇంటర్నెట్ గానీ హార్డ్‌వేర్ కమ్యూనికేషన్స్ వ్యవస్థ గానీ లేవు. అయితే, పోర్నోగ్రఫీ వీడియోలను ఆవరణలోని వారు ఎలా పొందారనేది చెప్పడం సాధ్యం కాకుండా ఉంది. టీవీ స్క్రీన్‌పై తనను తాను చూసుకుంటున్న లాడెన్ వీడియోను అమెరికా అధికారులు విడుదల చేశారు. దీన్ని బట్టి ఆ ఆవరణలో వీడియో ప్లేబ్యాక్ ఎక్విప్‌మెంట్ సౌకర్యం ఉన్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+