సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోసం సిఎం కిరణ్ పడిగాపులు

సోనియా ఆమోదంతో జూన్‌లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపడతారని భావించారు. మంత్రుల్లో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. ఏ ఇద్దరు మంత్రులకూ పడడం లేదు. ఈ స్థితిలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు అనుమతి పొందాలని ఆయన సోనియాను కలవాలని నిశ్చయించుకున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చి వెళ్లిన నేపథ్యంలో పరిస్థితిపై సోనియాకు వివరించాలని ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, రేపు ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కూతురు పెళ్లికి హాజరవుతారు. అనంతపురంలో పెళ్లికి హాజరైన తర్వాత తిరిగి ఆయన ఢిల్లీ వస్తారని అంటున్నారు. యుపిఎ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న తర్వాత సోనియా అపాయింట్‌మెంట్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి మల్లీ ప్రయత్నిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications