మంత్రి జూపల్లి కృష్ణారావు పాదయాత్రపై ఫైట్, మంత్రి డికె అరుణ అరెస్టు

జూపల్లి కృష్ణారావుపై డికె అరుణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం పార్టీలు జూపల్లి కృష్ణా రావు పాదయాత్ర వెనక ఉన్నాయని ఆమె ఆరోపించారు. పాదయాత్ర ద్వారా సానుభూతి పొందాలని కృష్ణారావు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. తన పిల్లలకు సీమాంధ్రులతో పెళ్లి చేశాననే చౌకబారు కామెంట్లు జూపల్లి చేస్తున్నారని ఆమె అన్నారు. తనకు చెప్పి ఉంటే తాను పాదయాత్రకు సహకరించి ఉండేదాన్ననని ఆమె అన్నారు. సమన్వయంతో సాగాల్సిన ఉద్యమాన్ని మొండివైఖరితో కృష్ణారావు కొనసాగిస్తున్నారు. కాగా, సొంత పూచీకత్తుపై డికె అరుణను ధరూర్ పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేశారు.












Click it and Unblock the Notifications