తన అరెస్టు సహేతుకం కాదంటున్న మంత్రి డీకే అరుణ

కాగా ఆమె ఈ ఉదయం వ్యక్తిగత పూచీకత్తు (బెయిల్)పై విడుదల అయ్యారు. అయితే తనను అరెస్టు చేయడం సహేతుకం కాదని, బాధ్యత గల మంత్రిగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడం సరైన పద్దతి కాదని ఆమె అన్నారు. తెలంగాణ వంకతో తన స్వంత ప్రయోజనాల కోసమే జూపల్లి పాదయాత్ర పేరుతో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. జూపల్లిని జిల్లా ప్రజలే ఆదరించటం లేదని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. డీకే అరుణ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ కార్యాకర్తలు గద్వాల్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను అడ్డుకుంటూ గద్వాల్ బంద్‌ను పాటించారు. ఆమె అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు ఐజ-రాయచూర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. మరోవైపు జూపల్లి కృష్ణారావు అరెస్టు చేసిన వెంటనే ఆయన అనుచరులు కూడా విధ్వంసానికి దిగారు. బస్సులకు నిప్పంటించారు. దుకాణాలు, ఇతర సంస్థలను మూసేయించారు.












Click it and Unblock the Notifications