గద్వాల పాదయాత్రపై రేపు నిర్ణయం తీసుకోనున్న జూపల్లి కృష్ణారావు

తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని తాను ఇది వరకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి కూడా లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తన లేఖకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. తన పాదయాత్రకు సహకరిస్తారో, వ్యతిరేకిస్తారో చెప్పాలని ఆయన అడిగారు. జూపల్లి కృష్ణా రావు పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు ప్రకటించారు.
తన నియోజకవర్గం గద్వాలలో మంత్రి డికె అరుణ జూపల్లి కృష్ణా రావు పాదయాత్రను అడ్డుకుంటున్నారు. తాను అడ్డుకోబోనని, స్థానికులు అడ్డుకుంటే తాను ఏమీ చేయలేనని ఓ మెలిక పెట్టారు. జూపల్లి కృష్ణా రావుపై ఆమె తాజాగా సోమవారం కూడా విమర్శలు చేశారు. పార్టీని చీల్చే ప్రయత్నాలు సరికాదని ఆమె అన్నారు. సొంత అభిప్రాయాలతోనే జూపల్లి పాదయాత్ర తలపెట్టారని ఆమె అన్నారు.