వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్బుతం, iPalmతో అరచేయే టచ్‌స్క్రీన్‌‌గా పనిచేస్తుంది...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Imaginary Phone
బైక్‌పై వెళ్తున్నప్పుడు మొబైల్‌ రింగ్‌ అవుతుంది. మాట్లాడే అవకాశం లేదు. అప్పుడు అరచేతిలో వేలితో తాకితే చాలు ఫోన్‌ కట్‌ అవుతుంది! బ్లూటూత్‌ చెవిలో, మొబైల్‌ జేబులో ఉంటుంది. నెంబర్‌ డయల్‌ చేయాలంటే మొబైల్‌ని తీయకుండా అరచేతిలో నొక్కితే చాలు! ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్‌ను చేతిలోకి తీసుకోకుండానే వాడొచ్చన్నమాట!

తలకు ధరించిన కెమెరాతో 'ఐపామ్‌' సిస్టం పని చేస్తుంది. జర్మనీకి చెందిన హస్సో ప్లాట్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు దీన్ని తయారు చేశారు. తలకు ధరించిన కెమెరా అరచేతిని మొబైల్‌ తెరలా పరిగణిస్తుంది. చేతిలో తాకగానే మొబైల్‌ తెరలోనూ అదే చోటులో ఉన్న మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌పుట్‌ తీసుకుంటుంది. (సైట్‌లోని వీడియో చూడండి) ఉదాహరణకు స్లీప్‌మోడ్‌ పోవాలంటే అరచేతిలో మధ్యలో తాకాలి. స్క్రీన్‌లాక్‌ను తీసేయాలంటే అరచేతి పై భాగంలో అడ్డంగా వేలితో స్వైప్‌ చేయాలి. ఇదే మాదిరిగా తెరపై ఉన్న అన్ని అప్లికేషన్లను యాక్సెస్‌ చేయవచ్చు. యాపిల్‌ ఐఫోన్‌కు అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

English summary
To decline the call and send it to your messaging service, you press the area of your palm corresponding to the position of the relevant button if you had the phone in your hand. Or you could press the buttons to answer the call and turn on the speakerphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X