వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిద్రిస్తున్న వారిపై దౌర్జన్యమా: బాబా అరెస్టుపై నిరసనల వెల్లువ

బాబా అరెస్టును సిపిఐ జాతీయ నేత డి.రాజా ఖండించారు. పోలీసుల దాడిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కపిల్ సిబాల్, ప్రణబ్ ముఖర్జీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఐపిఎస్ కిరణ్ బేడీ మాట్లాడుతూ నిద్రిస్తున్న వారిపై దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పోలీసుల చర్య ఖండించదగినదని మేథా పట్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా బాబా అరెస్టును ఖండించారు. బాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా రామ్ దేవ్ బాబా అరెస్టుకు నిరసనగా భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఆయన మద్దతుదారులు చేస్తున్న ధర్నాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి, గాంధీనగర్ పోలీసు స్టేషన్ తరలించారు.