వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిఎంకె పొత్తుపై చర్చించలేదు: ప్రధానితో భేటీ అనంతరం సిఎం జయలలిత

ఇటీవల కుంభకోణంలో ఇరుక్కు పోయిన కేంద్రమంత్రి దయానిధి మారన్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కోరినట్లు చెప్పారు. డిఎంకె పొత్తుపై చర్చ రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పలార్ డ్యామ్ పనులు నిలిపి వేయించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని ఆమె కోరారు. కాగా అంతకుముందు ఆమెకు ప్రధాని మన్మోహన్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రధాని దగ్గరకు ఎలాంటి తనిఖీలు లేకుండానే ఆమె వెళ్లారు. తనిఖీలు లేకుండా నేరుగా ఆమె ప్రధాని వద్దకు చేరుకోవడం విశేషం.