హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసి చార్జీల పెంపు, వంటగ్యాస్ తగ్గింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్తను అందిస్తూ ఆర్టీసి బస్సు ప్రయాణికులకు చేదు వార్తను అందిస్తోంది. ఆర్టీసి చార్జీలను పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా, సబ్సిడీ ఇవ్వడం ద్వారా వంటగ్యాస్ ధరను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వెల్లడించారు. ఆర్టీసి చార్జీల పెంపు అనివార్యమని ఆయన చెప్పారు. డీజిల్ ధర పెంచక ముందు ఆర్టీసి 300 కోట్ల నష్టాల్లో ఉందని, వరుసగా డీజిల్ ధరలు పెరగడం వల్ల 600 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందని, నష్టాలను పూడ్చడానికి చార్జీలు పెంచక తప్పదని ఆయన వివరించారు.

పల్లె వెలుగు బస్సుల చార్జీలను పన్ను నుంచి మినహాయించే అవకాశాలున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. వంటగ్యాస్ ధరను తగ్గించాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 161 కోట్ల రూపాయల మేర వంటగ్యాస్ ధరను తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో కాంగ్రెసు పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

ఆర్టీసి చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. డీజిల్ ధరలు గతంలో పెంచడం వల్ల ఆర్టీసి నష్టాలు 520 కోట్ల రూపాయలకు చేరుకుందని, ప్రస్తుత పెంపుతో 600 కోట్ల రూపాయల మేరకు నష్టాలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు కూడా పంపించినట్లు ఆయన తెలిపారు.

English summary
PCC President and transport minister Botsa Satyanarayana indicates hike in RTC bus charges and decrease in LPG price.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X