రోజుకు 5సార్లు సెక్స్ చేసే శక్తి ఉన్న ముసలి ప్రధాని!!

Berlusconi
ఎప్పుడూ ఏదో ఒక సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుంటూ వార్తల్లోకెక్కే ఇటలీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గురించి మరో ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది. ఈ 74 ఏళ్ల ముసలి ప్రధానమంత్రి రోజుకు ఐదు సార్లు రతి జరిపే శక్తి కలిగి ఉన్నాడని బెర్లుస్కోనీ వ్యక్తి వైద్యుడు ఆరోపించాడు. ప్రధానమంత్రి వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న "బుంగా బుంగా" పార్టీలో ఇద్దరు యువతులు నగ్నంగా 'మోక్ లెస్బియన్ షో' (స్త్రీలు స్వలింగ సంపర్కం చేసే ప్రదర్శన) నిర్వహించాడంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో సదరు వైద్యుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

డజన్ల కొద్దీ యువతులతో సెక్స్ కోసం బెర్లుస్కోనీ డబ్బు చెల్లించాడంటూ ప్రాసిక్యూటర్లు తనపై చేస్తున్న ఆరోపణలను గతంలోనే ఆయన ఖండిస్తూ.. తాను ముసలి వాడినని, తనకు అంత శక్తి లేదని పేర్కొన్నారు. ఇదే విషయంలో గత జనవరిలో బెర్లుస్కోనీ స్పందిస్తూ.. ఒకవేళ తాను 24 మంది యువతులతో పార్టీలు చేసుకొని ఉంటే తాను సూపర్‌మ్యాన్ కన్న గొప్పవాడిని అయి ఉండేవాడినని అన్నారు. కానీ, అతని వ్యక్తిగత వైద్యుడు మరియు పీపుల్ ఆఫ్ ఫ్రీడం పార్టీ ఎమ్‌పి అయిన అంబెర్టో స్కపగ్నినీ మాత్రం అతను (బెర్లుస్కోనీ) చాలా మొరటు ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడని తెలిపారు.

"భౌతికంగా ఆయనకు ఓ 60 ఏళ్ల ఆరోగ్యం ఉంది, లేదా అంతకన్నా తక్కువగా కూడా ఉంటుంది, బెర్లుస్కోనీకి ఒక రోజులో చాలా సార్లు సెక్స్‌లో పాల్గొనగలడు, నాలుగు లేదా ఐదు సార్లు కూడా కావచ్చు" అని స్కపగ్నినీని ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఇంజెక్షన్లు, పిల్స్ ఇవ్వాల్సిందిగా సూచించమని బెర్లుస్కోనీ తనని అడిగేవాడని, రెండు వారాల క్రితమే అతడిని చూశానని, ఆయన మంచి శరీర సౌష్టవాన్ని కలిగి ఉన్నాడని స్కపగ్నినీ తెలిపారు. ఇప్పటికే బెర్లుస్కోనీ మైనర్ బాలికతో శృంగారం జరిపినట్లు వివిధ ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+