కాంగ్రెసు వెనుకే మేము ఉంటాం: ఎర్రబెల్లి

ఇప్పుడు కాంగ్రెసు పార్టీ రాజీనామాలకు ముందుకు వచ్చింది కాబట్టి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి తాము కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీయే అని కాబట్టి ఆ పార్టీ నేతలు ముందుగా రాజీనామా చేయాలన్నారు. సోమవారం కాంగ్రెసు వారు రాజీనామా చేసిన వెంటనే మేమూ రాజీనామా చేస్తామని అన్నారు. అన్ని పార్టీల నేతలు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాల అనంతరం ఎన్నికలలో ఎవరూ పాల్గొనవద్దని అయన సూచించారు. మహానాడు ప్రకటనకు తాము కట్టిబడి ఉన్నామని మరో నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరబోతుందని అన్నారు.












Click it and Unblock the Notifications