వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తేల్చేసిన హైకమాండ్, ఇవ్వలేమని స్పష్టం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ‌‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వలేమని, రాష్ట్రాన్ని ఇవ్వలేమని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులకు, మంత్రి జానా రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయినా, తిరిగి పార్టీ అధికారంలోకి రాకపోయినా సరే, తెలంగాణ ఇచ్చేది లేదని కచ్చితంగా తేల్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాల వ్యవహారాన్ని విస్మరించే ధోరణిని ప్రదర్శించాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీలతో మంగళవారం అర్థరాత్రి దాటే వరకు జరిపిన చర్చలు ఏ మాత్రం ముందుకు సాగలేదని చెబుతున్నారు.

తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాల వల్ల యుపిఎ ప్రభుత్వానికి ముప్పు లేదని గులాం నబీ ఆజాద్ అనడం అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వీలైనంత వరకు తెలంగాణ ప్రజాప్రతినిధులను బుజ్జగించే వ్యవహారాన్ని ముందుకు సాగించడమే కార్యాచరణగా ముందుకు సాగాలని సోనియా నుంచి అధిష్టానం పెద్దలకు సూచనలు అందినట్లు చెబుతున్నారు. అధిష్టానం తమ మాటలను కనీసం కూడా వినడానికి సిద్ధంగా లేదని, రాజీనామాలు ఉపసంహరించుకోవాలని చెప్పడం తప్ప తెలంగాణపై హామీ ఇవ్వడం లేదని అనుభవం ద్వారా తెలుసుకున్న పార్లమెంటు సభ్యులు గులాం నబీ ఆజాద్ సమావేశాన్ని కూడా బహిష్కరించారు.

పార్టీ అధిష్టానం నుంచి ఏ విధమైన సానుకూలత వ్యక్తం కాకపోవడంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సహా మరికొంత మంది రాష్ట్రానికి తిరిగి వచ్చారు. కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరు కూడా అధిష్టానం వైఖరిని బయట పెడుతోంది. కాంగ్రెసు నాయకత్వంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మొదటి ముద్దాయి కాంగ్రెసు పార్టీయే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు.

English summary
Congress high command cleared to his party Telangana MPs that it is not possible to form Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X