ఉస్మానియాలో ఉద్రిక్తత, బాష్పవాయు ప్రయోగం

విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పరామర్శించారు. ఉస్మానియా విద్యార్థుల దీక్షకు మద్దతుగా వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు దీక్ష చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాజకీయ నాయకులుగా తాము వెళ్తామని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. విద్యార్థుల దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కలిసి కోరారు.












Click it and Unblock the Notifications