1993 నుంచి ఉగ్రవాద హిట్ లిస్టులో జవేరీ బజారు

ఆ సమయంలో ముంబైలో 13 వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 257 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారు. అప్పుడు జవేరి బజారులో పార్కు చేసి ఉంచిన స్కూటర్‌లో పెట్టిన బాంబును పోలీసులు కనిపెట్టి నిర్వీర్యం చేశారు. అయితే 2003లో ఉగ్రవాదుల ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఉగ్రవాద దాడిలో 54 మంది చనిపోయారు. జవేరీ బజార్ ఇరుగ్గా ఉంటుంది. పలు దుకాణాలతో చిన్న సందులతో బజారు ఉంటుంది. దీంతో ప్రజలు అక్కడి నుంచి త్వరగా కదిలిపోవడానికి వీలు కాదు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఆగి స్నాక్స్ ఆరగించే దుకాణం వద్ద బుధవారం పేలుడు సంభవించింది. సాయంత్రాలు ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రజలు ఇక్కడ త్వరగా స్నాక్స్ తిని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.












Click it and Unblock the Notifications