వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ సెల్‌పై కన్నేసిన ముఖేష్ అంబానీ రిలయన్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani
ముంబై: టెలికాం రంగంలో ఆగ్రగామిగా నిలచే క్రమంలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ (ఆర్ఐఎల్)అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే టెలికాం రంగంలో నిలదొక్కుకున్న ఎయిర్ సెల్ ను కోనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఎయిర్ సెల్ నియంత్రణ స్థాయి వాటాలు కోనుగోలు కోసం తుది దశ సాధ్యసాధ్యాల పరిశీలన ప్రక్రియను రిలయన్స్ నిర్వహిస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటికే మూడు ధశల్లో డ్యూ డెలిజన్స్‌ను పూర్తి చేసిందని చర్చల్లో ఇరు వర్గాల మధ్య అనుకూలత వస్తే ఎయిర్ సెల్ వాటాను కోనుగోలు చేసేందుకు రిలయన్స్ ముందుకు రావచ్చని చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను రిలయన్స్ ప్రతినిధి ఖండించిన్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరో పక్క ఎయిర్ సెల్ అధికార ప్రతినిధి ఊహాజనిత వదంతులుగా కొట్టి పారేసినట్లు సమాచారం.

నిరుడు ఇన్ ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ ను కోనుగోలు చేయడం ద్వారా రిలియన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యప్తంగా 22 సర్కిళ్లలో బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ యాక్సెస్ బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్ను దక్కించుకుంది. బ్రాడ్ బ్యాండ్ సేవలకు ప్రారంభానికి అనువుగా భారీ స్థాయిలో కస్టమర్లు, మౌలిక సదుపాయాలు గల టెలికాం సర్వీస్ కోసం రిలయన్స్ అన్వేషిస్తుందని సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్ లున్న ఎయిర్ సెల్ కు ప్రస్తుతం 6 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. 8 సర్కిళ్లలో బీడబ్ల్యూఏ లైసెన్స్ తో పాటు 13 సర్కిళ్లలో 3జీ లైసెన్స్ లను ఎయిర్ సెల్ దక్కించుకుంది. 2010 క్యాలండర్ ఏడాదిలో ఎయిర్ సెల్ రూ.5600 కోట్ల ఆదాయాన్ని అర్జించగా, రూ.260 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఏడాది చివరికల్లా కంపెనీకి రూ.1700 కోట్ల రుణ భారం ఉండవచ్చని అంచనా. మలేసియాకు చెందిన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ కు ఎయిర్ సెల్ లో 74 శాతం వాటా ఉంది. ఎయిర్ సెల్ వాటాను విక్రయించేందుకు పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో మ్యాక్సిస్ చర్చలు జరుపుతుందని, అయితే వాల్యూయేషన్ అంచనాల్లో విభేదాలు కారణంగా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని వర్గాలు చెబుతున్నాయి.

మలేసియా బిలియనీర్ తత్పరానందం ఆనంద్ కృష్ణన్ కు చెందిన సంస్థే మాక్సిస్. ఎయిర్ సెల్ తన 17500 టెలికాం టవర్లను మనోజ్ తిరోద్కర్ కు చెందిన జీటీఎల్ ఇన్ ఫ్రాకు గతేడాది దాదాపు రూ.2 బిలియన్ డాలర్లుకు విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీటీఎల్ కు 50 ఆదాయం ఎయిర్ సెల్ నుంచే లభిస్తోంది. మ్యాక్సిస్ సంస్థ భారతీయ మార్కెట్లో మొబైల్ విర్ట్య్ ల్ నెట్ వర్క్ ఆపరేటర్ ద్వారా టెలికామ్ సేవలు అందిస్తుందని, అదనపు భారంతో చేపట్టబోదని వర్గాలు పేర్కొన్నయి.

English summary
Reliance trying to own the aircel for improving their telecom market .A spokesperson for Reliance Industries denied any such move. An Aircel Spokesperson said in response to queries from ET Now, "This is a baseless rumour and a mere speculative report".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X