యుఎస్‌లో పాకిస్తాన్ అనుకూల అమెరికన్ అరెస్టు

ఫాయిలాగానే మరో అమెరికా పౌరుడైన జహీర్ అహ్మద్ కూడా ఇటువంటి కార్యకలాపాలే చేస్తున్నాడని అయితే ప్రస్తుతం అతను పాకిస్తాన్లో వున్నాడని అమెరికా అధికార్లు చెపుతున్నారు. ఫాయి గత రెండు దశాబ్దాలుగా కాశ్మీర్ వేర్పాటు వాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ వాషింగ్టన్ డిసి లో ప్రముఖ వ్యక్తిగా చెలామణి అవుతున్నాడు. అమెరికాలోని సెనేటర్లతోను, కాంగ్రెస్ సభ్యులతోను సన్నిహిత సంబంధాలు కలిగి వున్నాడు. పాకిస్తాన్ గూఢచారి శాఖ ఐఎస్ఐ నిధులు సరఫరా చేస్తున్న కాశ్మీరి - అమెరికన్ కౌన్సిల్ (కెఎసి)కి ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇదే మాదిరి కాశ్మీర్ వేర్పాటు వాదుల కేంద్రాలు లండన్, ఇంగ్లాండ్, బ్రస్సెల్స్, బెల్జియంలలో కూడా వున్నాయి. పాకిస్తాన్ దేశ ప్రయోజనాలు కాపాడవలసిందిగా ఈ కేంద్రాలకు పాకిస్తాన్ గూఢచారి శాఖ ఐఎస్ఐ సొమ్ము పంపడం, వీరు ఆయా దేశాలలోని శాసన సభ్యులు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా వ్యవహరించేలా చేయడం వీరు చేయాల్సిన పనిగా తెలుస్తోంది. కెఎసి డైరెక్టర్ ఫాయి విషయంలో ఐఎస్ఐ గత 25 సంవత్సరాలుగా ఆదేశాలను ఇస్తోందని ఎఫ్ బిఐ అధికార్లు దాఖలు చేసిన ఎఫిడవిట్లో వెల్లడి అయింది. పాకిస్తాన్ ప్రభుత్వంలో నలుగురు వ్యక్తులు అమెరికాలోని ఫాయి కార్యకలాపాలను నియంత్రిస్తున్నారు. జూన్ 2008 నాటినుండి ఇప్ఫటికి ఫాయి వారితో నాలుగువేల సార్లు మాట్లాడినట్లు ఎఫ్ బిఐ వెల్లడించింది. కెఎసి నివేదికలు, బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఫాయి పాకిస్తాన్ ప్రభుత్వంలోని సభ్యులకే ఆమోదానికి పంపేవాడు.
'కెఎసి కార్యాచరణ ప్రణాళిక - కాశ్మీర్ సెంటర్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2009" అంటూ తయారు చేసిన డాక్యుమెంటు కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని ఎలా అభివృధ్ధి చేయాలి ? కెఎసి సంస్ధకు అమెరికాలోని సెనేట్ సభ్యులు, పెంటగాన్, మీడియా వర్గాల ద్వారా ఏ రకంగా ప్రయోజనాలు కల్పించాలి అనే అంశాలు వివరిస్తోంది. ఎఫిడవిట్ మేరకు ఫాయి కెఎసి బడ్జెట్ ప్రతిపాదనలలో కాంగ్రెస్ సభ్యులకు 2009 సంవత్సరానికి 100,000 డాలర్ల విరాళాలను ప్రతిపాదించాడు. పాకిస్తాన్లోని అహ్మద్ నుండి లేదా అతని నెట్వర్క్ ద్వారా కె.ఎ.సి లేదా ఫాయి 1990ల నుండి పాకిస్తాన్ ప్రభుత్వం నుండి సుమారు 4 మిలియన్ డాలర్లవరకు సరఫరా అయినట్లు ఎఫ్ బిఐ చెపుతోంది. అహ్మద్ అమెరికాలోని తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఫాయికి చెల్లింపులు ఏర్పాటు చేసి వాటి తిరిగి చెల్లింపులు పాకిస్తాన్లో చేయిస్తూంటాడు.












Click it and Unblock the Notifications