గాలి జనార్దన్ రెడ్డి తవ్వకాల కథ ఇంతింత కాదయా

ఇనుప ఖనిజం ఎక్కువగా ఉన్న బళ్లారిలో మాఫియా తరహా పరిస్థితి ఉందని, అక్కడి వ్యవహారాలన్నింటికీ యడ్యూరప్ప బాధ్యుడని హెగ్డే తేల్చి చెప్పారు. ''అది చాలా పెద్ద రాకెట్. బళ్లారిలో జరిగే వ్యవహరాలన్నింటికీ యడ్యూరప్ప బాధ్యుడు. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి (ఓఎంసీ) యజమాని. అక్కడ మాఫియా తరహా పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క అధికారి ప్రమేయం ఉంది. ఇతర మైనింగ్ కంపెనీలను దోచుకునే విధంగా అక్కడ ఓ కొత్త వ్యవస్థను సృష్టించారు''అని హెగ్డే చెప్పారు.
''వివిధ కంపెనీలు తవ్వి తీసిన ఖనిజంలో 40 నుంచి 50 శాతం ఆ కంపెనీకి (ఓఎంసీ) ఇవ్వాలి. అప్పుడు ఆ కంపెనీల ఖనిజమంతా వారు(ఓఎంసీ) రవాణా చేస్తారు. ఒక వేళ ఆ కంపెనీల లారీలు పట్టుబడ్డా ఓఎంసీ చూసుకుంటుంది. వాటిని విడిపించి ఎగుమతయ్యేలా చూస్తుంది'' అని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై భారీ ఎత్తున దర్యాప్తు చేయాలని తాను సిఫార్సు చేసినట్లు హెగ్డే వెల్లడించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప, గాలి జనార్దనరెడ్డి సోదరులు, మంత్రులు సోమణ్ణ, శ్రీరాములు, ఎంపీ సంతోష్‌లాడ్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడిన ఆధారాలన్నింటినీ నివేదికలో పొందుపరిచామని చెప్పారు.
అక్రమ గనుల్లో కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ పార్టీలన్నీ ఒకటేనన్నారు. అక్రమ గనుల తాలూకూ సొమ్మును విదేశాల్లో దాచారా అని ప్రశ్నించగాకొన్ని ఉదంతాలున్నాయన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎగుమతుల ద్వారా సంపాదించిన సొమ్మును తిరిగి భారత్‌కు తీసుకు రాని సందర్భాలుయని చెప్పారు. ''ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దీనిపై (ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారాలపై) విచారణ నిర్వహించాలని సిఫార్సు చేశాం'' అని వెల్లడించారు.
తాను మూడేళ్ల పాటు ఎంతో శ్రమించి రూపొందించిన నివేదిక లీక్ కావటంపై హెగ్డే ఆవేదన చెందారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన కన్నీరు పెట్టారు. ''నివేదిక లీక్ కావటం వెనుక ప్రభుత్వ హస్తం ఉంది. మూడు నెలలుగా నా ఫోన్ల సంభాషణల ట్యాపింగ్ (చౌర్యం) జరిగింది. ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలో గూఢచర్యం జరిగిందన్న కథనాలు వెలువడ్డాక నా కార్యాలయంలో తనిఖీ చేయాల్సిందిగా ఓ నిపుణుడికి చెప్పాను. నా టెలిఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆయన చెప్పారు. ప్రతి విషయాన్నీ రెండు చోట్ల నుంచి రికార్డు చేశారు. సిమ్ కార్డును మార్చేశా'' అని వెల్లడించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications