వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ రాజీనామాలు చేస్తాం, స్పీకర్ చేతికే: ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ రాజీనామాలు చేస్తామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఫోరం విస్తృత స్థాయి సమావేశం తర్వాత తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకే రాజీనామాలు సమర్పిస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే జైలుకు వెళ్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కిరణ్ కమార్ రెడ్డి ఇంకా స్పీకర్‌గానే ఉన్నానని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత మందిని అరెస్టు చేస్తారో చేసుకోమనండి అని ఆయన అన్నారు.

తమ రాజీనామాలను తిరస్కరించడం ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్ తప్పు చేశారని ఆయన అన్నారు. దేశంలో ఏ స్పీకర్ కూడా చేయని తప్పు ఆయన అన్నారు. సభ్యుల హక్కులను స్పీకర్ కాలరాశారని, స్పీకర్‌గా ఉండే అర్హత నాదెండ్ల మనోహర్‌కు లేదని ఆయన అన్నారు. స్పీకర్ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్తామని, అందుకు నలుగురితో ఓ కమిటీ వేశామని ఆయన అన్నారు. స్పీకర్ వచ్చిన తర్వాత రాజీనామాలు చేయడానికి అన్ని పార్టీల తెలంగాణ శాసనసభ్యులు ముందుకు రావాలని, క్యూలో నిలబడి రాజీనామాలు ఇద్దామని ఆయన అన్నారు. రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి కేంద్రం దిగి వచ్చేలా చేయడానికి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని ఆయన అన్నారు.

English summary
TDP Telangana MLAs also decided resign again. They will resign after Assembly speaker Nadendla Manohar's arrival from abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X