లగడపాటి రాజగోపాల్‌కి వైయస్ జగన్ వర్గం షాక్

అయితే అక్కడే ఉన్న లగడపాటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. వారికి సర్దిచెప్పలేని స్థితిలో ఉండిపోయాడు. అయితే స్థానిక నాయకులు కలుగజేసుకొని వారికి సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఇటీవల లగడపాటిని అడ్డుకోవడం సహజంగా కనిపిస్తోంది. రెండు మూడు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ కార్యక్రమానికి హాజరైన లగడపాటిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పూర్తి భద్రతతో ఆయనను ఆ కార్యక్రమానికి హాజరుపర్చి ఆ తర్వాత పంపించేశారు. అంతకుముందు కృష్ణా జిల్లాలోనే కారులో వెళుతున్న లగడపాటిని జగన్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే లగడపాటి అనుచరులు వారి కారు అద్దాలు ధ్వంసం చేసి తరిమి కొట్టారు.












Click it and Unblock the Notifications