వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక సిఎం యడ్యూరప్పకు ఉద్వాసన, కాంగ్రెసు టార్గెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఉద్వాసన పలికి, కాంగ్రెసు అవినీతిపై పోరాటానికి సిద్ధపడాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ నాయకత్వం భావిస్తోంది. యడ్యూరప్పను కొనసాగిస్తూ కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోకాయుక్త సంతోష్ హెగ్డే నివేదిక సమర్పించగానే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాలని బిజెపి నాయకత్వం యడ్యూరప్పను అడిగే అవకాశం ఉంది. మైనింగ్ కుంభకోణంలో లోకాయుక్త యడ్యూరప్పను తప్పు పట్టిన నేపథ్యంలో బిజెపి ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మార్షియస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే యడ్యూరప్పతో బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడుతానని యడ్యూరప్ప నితిన్ గడ్కరీతో చెప్పినట్లు సమాచారం. కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేయాలంటే అది తప్పని, యడ్యూరప్పను కొనసాగిస్తే తమపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తాయని బిజెపి నాయకత్వం అనుకుంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, రాష్ట్ర పార్టీ చీఫ్ కెఎస్ ఈశ్వరప్ప, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో యడ్యూరప్ప మాట కీలకం కానుంది.

లోకాయుక్త నివేదిక ఆధారంగానే కర్ణాటక నాయకత్వంపై తమ నిర్ణయం ఉంటుందని గడ్కరీ చెప్పారు. పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ కూడా యడ్యూరప్పను తొలగించడమే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. అధికార మార్పిడి ప్రశాంతంగా జరగడానికి యడ్యూరప్ప అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది.

English summary
BJP seems set to get rid of Karnataka chief minister BS Yeddyurappa, in a move shaped by its desire to step up its offensive against Congress on the issue of corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X