అక్కినేనిపై విమర్శలా: గుత్తాపై కాట్రగడ్డ ప్రసాద్

కథానాయకుడిగా బిజీగా ఉన్న రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అప్పట్లో రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన అక్కినేనిని అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయడం గుత్తాకు తగదన్నారు. ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం కేటాయించినప్పుడు అక్కడ స్థలం ఎకరా కేవలం రూ.వెయ్యి మాత్రమేనని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి అనవసరంగా సినీ పరిశ్రమకు చెందిన వారిని లాగడం సరికాదని హితవు పలికారు. గుత్తా అక్కినేనికి క్షమాపణ చెప్పాలన్నారు.
హైదరాబాదులో సెటిలర్ల సంఖ్య ఐదారు లక్షలు కాదు, కనీసం 50 వేలు కూడా లేదన్నా కాదనేవారు ఎవరూ లేరని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎవరి నోటికొచ్చినట్లు వారు మాట్లాడవచ్చునని, ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన లెక్కలు చెరిగిపోవని ఆయన అన్నారు. హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర నామమాత్రం కాదు, ఏ మాత్రం లేదన్నా ఆశ్చర్యపడేవారెవరూ లేరని ఆయన న్యూఢిల్లీలో అన్నారు.