ఫైవ్ స్టార్ హోటళ్లలో కర్నాటక రాజకీయం

కాపిటల్ హోటల్‌లో బిజెఎల్పీ సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తన వర్గంతో కలిసి పెవిలియన్ హోటల్లో బస చేశారు. ఆయన వ్యతిరేక అనంతకుమార్ వర్గం అశోక హోటల్లో రాజకీయం నెరపుతున్నట్టుగా సమాచారం. వీరి రాజకీయాలను అధిష్టానం ప్రతినిధులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ మరో హోటల్ మెరిడియన్ హోటల్లో ఉండి వారి రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యడ్యూరప్పకు చెక్ చెప్పేందుకు ఆయన వర్గానికే చెందిన షెట్టార్ పేరును అనంతకుమార్ వర్గం ప్రతిపాదిస్తోంది. ఎవరికి వారు తమకు ఎక్కువ మెజారిటీ ఉందని అధిష్టానం వద్ద చెప్పుకునేందుకు ఎవరికి వారు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications