హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంతో ఢీ కొట్టలేదు, వాస్తవాలు చెప్పా: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాను ఢీకొట్టింది ఏమీ లేదని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గురువారం అన్నారు. ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆరోగ్యశ్రీలో ఉన్న వాస్తవాలే తాను చెప్పానని అన్నారు. ఆరోగ్య శ్రీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, ప్రైవేటు హాస్పిటళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నాయని, తన శాఖ గురించి పూర్తిగా చెప్పాలంటే తాను మంత్రి పదవి రాజీనామా చేసి చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాస్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గురువారం దీనిపై స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు.

14ఎఫ్ పై తనకు అవగాహన లేదని మంత్రి చెప్పారు. 14ఎఫ్ ఉన్నా తొలగించినా నష్టం ఉండదని చెప్పారు. హైదరాబాదులో సబ్ ఇన్స్‌పెక్టర్ పోలీసుల ఉద్యోగాలు లేనప్పుడు ఇక వివాదం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాదులో ఉద్యోగాలు ఖాళీ లేవని ముఖ్యమంత్రితో పాటు మంత్రి జానారెడ్డి సైతం అన్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులను కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఎప్పుడు పిలుస్తారో తెలియదన్నారు. పిలిచినప్పుడు వెళతామని చెప్పారు.

English summary
Minister DL Ravindra Reddy said today that he has no differences with CM Kiran Kumar Reddy. He said there in no problem of 14F if cancel or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X