ఏనుగు అడిగితే కొయ్యబొమ్మ ఇచ్చాం: ఆనం

14ఎఫ్‌ను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మద్దతిస్తున్నామని మరో కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. 14ఎఫ్ రద్దు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత కోర్టుకు వెళ్లే విషయంపై ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. 14ఎఫ్ రద్దుపై కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణవాళ్లు బ్లాక్ మొయిల్ చేస్తున్నారని ఆయన గుంటూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications