వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాహాజారే కోసం: తీహార్‌కు భారీగా తరలిన ప్రజలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Bedi
న్యూఢిల్లీ: సంఘ సంస్కర్త అన్నాహజారేను ఉంచిన తీహారు జైలుకు భారీగా ప్రజలు, అన్నాహజారే అభిమానులు బుధవారం చేరుకున్నారు. అన్నాహజారేకు మద్దతుగా, ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నాహజారే ఏ నిమిషంలోనైనా జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు. అందరూ అన్నా చిత్రాలతో కూడిన చొక్కాలతో, జాతీయ జెండాలతో తరలి వచ్చారు. అన్నాహజారే గట్టి మద్దతుదారులు అయిన కిరణ్ బేడీ, స్వామి అగ్నివేష్, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేథాపట్కర్ జైలు వద్దకు చేరుకున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సైతం రానున్నారు.

ఈ సందర్భంగా స్వామి అగ్నివేష్, కిరణ్ బేడీ మాట్లాడారు. అన్నా కోసం అందరం ఎదురు చూస్తున్నామని ఆయన రాగానే అందరం కలిసి జెపి పార్కుకు వెళదామని ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అవినీతిని నిర్మూలించాల్సిందే అని వారు అన్నారు. కాగా లోక్‌సభలో ప్రధాని హజారే అరెస్టుపై ప్రకటన చేసిన అనంతరం సభాపతి మీరాకుమార్ చర్చకు అనుమతించారు. అయితే చర్చ సమయంలో ప్రధాని వెళ్లడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని ఉండాల్సిందేనని పట్టుబట్టారు. ప్రధాని వ్యాఖ్యలపై ఎల్‌కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లోక్‌సభ, రాజ్యసభలలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హజారే అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. హజారే దీక్షకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ఆయన దీక్ష ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని రోజులు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడటానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రధాని చర్చలో ఉండాలని విపక్షాలు పట్టుబట్టడంతో లోకసభ స్పీకర్ మీరాకుమార్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అరగంట తర్వాత సభ ప్రారంభం అయింది.

English summary
Delhi people make queue to Tihar Jail for Anna Hazare. Kiran Bedi, Swamy Agnivesh, Medha Patkar were came and Baba Ramdev will come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X