వైయస్‌ని దోషిగా నిలబెట్టినందుకే: బోస్, కొండా సురేఖ

జగన్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తున్న కారణంగా వైయస్ అనుచరులుగా తాము పదవులకు, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పిస్తామని చెప్పారు. సిబిఐ ముసుగులో వైయస్‌ను నేరస్థుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైయస్‌ను అభిమానించే వారంతా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము రాజీనామాలు సమర్పించే సమయంలో మరికొందరు వస్తారని అన్నారు.
పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ మాట్లాడాతూ తాను తెలంగాణ కోసం ఇప్పటికే రాజీనామా చేశానని మరోసారి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తన రాజీనామాను ఆమోదించుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications