హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడుగురు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు వెనక్కి?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాజీనామాలు సమర్పించిన 26 మంది వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల్లో ఏడుగురు పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 29 మంది శానససభ్యులు రాజీనామాలు చేయాల్సి ఉండగా, 26 మంది మాత్రమే చేశారు. అందులోనూ ఏడుగురు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ జాతీయ చానెల్‌లో వార్తాకథనం వచ్చింది. ఆ ఏడుగురు శాసనసభ్యులు కూడా స్పీకర్ కార్యాలయంతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. తమ రాజీనామాలపై చర్యలు తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. మరింత శాసనసభ్యులు తమ వైపు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతుండగా ఈ పరిణామం పెద్ద దెబ్బనే.

రాజీనామాలపై వస్తున్న ప్రతికూలత వల్ల కూడా వారు పునరాలోచనలో పడినట్లు సమాచారం. కాగా, ఐదుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, వారి షరతులకు అంగీకరించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని తెలుస్తోంది. రాజీనామాలు చేసిన శాసనసభ్యులకు టికెట్ గ్యారంటీ ఇవ్వడానికి, ఎన్నికల ఖర్చులు భరించడానికి జగన్ హామీ ఇవ్వకపోవడమే కాకుండా సీనియర్ శాసనసభ్యులతో తప్ప జూనియర్లతో మాట్లాడడానికి కూడా జగన్ ఇష్టపడకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.

కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను ముగించుకుని జగన్ ఈ నెల 30వ తేదీన హైదరాబాదుకు వస్తారు. అప్పుడు శాసనసభ్యులతో, సీనియర్ నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్‌లో సిబిఐ వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే.

English summary
The hope in YSR Congress seems to be fading in less than 36 hours as at least seven out of the 26 MLAs, who had resigned from the assembly protesting the inclusion of late Chief Minister, Y S Rajasekhar Reddy’s name in the CBI FIR in Kadapa MP Jaganmohan Reddy’s illegal assets case seeking to retracing their step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X