సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని సవాల్ చేసిన నాగం

Nagam Janardhan Reddy
మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్‌‍లో సవాల్ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఎన్నికలు పెట్టి చూడాలని నాగం డిమాండ్ చేశారు. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా లేవని అందుకే వారు వెనుకాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఓటమి భయంతోనే కాంగ్రెసు, టిడిపి ఎన్నికలు వెనకాడటం శోచనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకుండా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+