వికీలీక్స్: స్పీకర్‌పై తెలంగాణ, దళిత పిడుగులు

మాదిగ సామాజిక వర్గానికి చెందిన 30 ఏళ్ల వయస్సు పైబడిన విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల జెఎసి ర్యాడికల్ సభ్యులుగా ఉన్నారని, విద్యాసంవత్సరం నష్టపోతామా, లేదా అనే ఆలోచన లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు కూడా వికీలీక్స్ వెల్లడించింది. దీంతో తీవ్ర ఇరకాటంలో పడిన నాదెండ్ల మనోహర్‌పై విమర్శలు వస్తున్నాయి.
నాదెండ్ల మనోహర్‌పై తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. మనోహర్ తెలంగాణకు, దళితులకు వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. వికీలీక్స్ కేబుల్స్ నివేదికలు వాస్తవం కాదని స్పీకర్ నిరూపించుకోవాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, నాదెండ్ల మనోహర్ వికీలీక్స్ వెల్లడించిన అంశాలను ఖండించారు. తెలంగాణ గురించి తాను ఎవరితోనూ ఎక్కడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న వార్తలు నిరాధారమని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్‌పై వికీలీక్స్ వ్యాఖ్యలపై తాను స్పందించబోనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications