మోహన్‌లాల్ వద్ద బంగారు విగ్రహాలు, పాత గన్నులు

పురాతత్వ శాఖ అధికారులు ఉధగమందాళంలోని లవ్‌డేల్‌లో గల మోహన్‌లాల్ ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ సోదాల్లో అధికారులు పెద్ద యెత్తున పురాతన కళాఖండాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫామ్‌హౌస్‌లోని మోహన్‌లాల్ నిక్షేపాలను కూడా అధికారులు వెలికి తీశారు. పది గంటల పాటు ఎనిమిది మంది అధికారులు బుధవారం సోదాలు చేశారు.
ఫామ్‌హౌస్‌లో వారికి వందేళ్ల నాటి నాలుగు గన్నులు, రెండు బంగారు విగ్రహాలు అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది. వాటిని ఆయన తిరువనంతపురం రాచకుటుంబం నుంచి పొందినట్లు చెబుతున్నారు. పురాతన కళాఖండాల విలువ ఎంత ఉంటుందనేది తెలియదు. పురాతన కళాఖండాలు గల గదికి అధికారులు తాళం వేసి, సీల్ చేశారు. వాటిని మోహన్‌లాల్ ఎలా పొందాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications