హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ ముందుకు సూర్య పత్రిక అధినేత, డి శ్రీనివాస్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ కేసు విషయంలో మంగళవారం పలువురు ప్రముఖులు సిబిఐ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. జగన్ కంపెనీలలోకి విదేశీ నిధుల ప్రవాహం విషయంలో ప్రముఖ తెలుగు దిన పత్రిక సూర్య అధినేత నూకారపు సూర్య ప్రకాశ్ రావు సిబిఐ ముందు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సూర్య పత్రిక ప్రతినిధులు ఉదయమే సిబిఐ ముందు హాజరయి సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. ఆ తర్వాత అధినేతను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి వరుసగా పదకొండో రోజు కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు.

అలాగే ఎమ్మార్ కేసులోనూ ఎమ్మార్‌లో విల్లాలు కొన్న పలువురు ప్రముఖులు సిబిఐ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సిబిఐ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. విల్లాలు కొన్న వారిలో ఇప్పటికి పదిమందిని సిబిఐ విచారించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు నుండి వరుసగా మిగిలిన వారిని విచారించనుంది. ఎమ్మార్‌లో సుమారు 80 మంది వరకు తక్కువ ధరకే విల్లాలు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ నాలుగు బృందాలుగా ఒక్కో బృందంలో నలుగురు అధికారులు ఉండి విచారణ చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దిల్ కుష్ గెస్ట్ హౌస్‌లో విచారణ జరుపుతున్నారు.

కాగా సిబిఐ విచారణకు ఎమ్మార్, భారతి ఇన్ ఫ్రా, ఇంపీరియల్ కన్‌స్ట్రక్షన్స్, వైయస్సార్ కన్‌స్ట్రక్షన్స్, సరస్వతి పవర్, ఎమ్మార్ విల్లాస్ కస్టమర్స్, భారత్ ఇన్ ఫ్రా, లోటస్ ఫార్మా, సూర్యా పేపర్ ప్రతినిధులు, ఇంపీరియల్ కన్‌స్ట్రక్షన్స్, జొన్నలగడ్డ వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావు, ఉషారాణి తదితరులు హాజరయ్యారు.

English summary
Surya Telugu Daily MD Nukarapu Surya Prakash Rao and former PCC chief D Srinivas may attend before CBI today in Jagan case and EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X