భార్యకు జమ్మూ కాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా విడాకులు

ఓమర్, పాయల్ ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నారని చెబుతున్నారట. వీరి విడాకులకు మీడియా గరల్ ఒక కారణం కాగా రెండో కారణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజకీయ నాయకుడి చెల్లెలు అనే వాదన కూడా ఉందట. ఓమర్ విడాకులు తీసుకొని మీడియా గరల్‌ను కానీ జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకుడి చెల్లెలిని కానీ పెళ్లి చేసుకోవచ్చుననే వాదనలు వినిపించినందునే వీరి దాంపత్య జీవితంలో పొరపొచ్చాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓమర్ అబ్దుల్లా జాతీయస్థాయిలో పేరున్న రాజకీయ నాయకుడు. దేశ రాజధాని ఢిల్లీతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా ఈయన రాజకీయ జీవితంపై కొద్దిగా ప్రభావం పడే అవకాశం ఉంది.
భార్యతో తాను విడిగా ఉంటున్న విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. అయితే, తన వ్యక్తిగతజీవితంపై, ముఖ్యమంత్రి తన పెళ్లి విషయంపై మీడియా ఊహాగానాలు తనను బాధిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తాకథనాలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో సమస్య తలెత్తిన విషయం వాస్తవమేనని, అది తన పనిపై ఏ విధమైన ప్రభావం చూపడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications