జఫెరా ఎల్‌ఎల్‌సి కొనుగోలు చేసిన కాగ్నిజెంట్

రాబోయే కాలంలో రిటైలర్ల మార్జిన్లు తగ్గుతున్నాయని, వినియోగదారులను ఆకట్టుకొని, నిలబెట్టుకోవడం రిటైల్ సంస్థలకు గట్టి సవాల్‌గా మారుతోందని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు. ఈ సవాళ్లను అధిగమించడమే కాకుండా, మల్టీ ఛానల్ రిటైలింగ్ ద్వారా లభ్యమయ్యే అపార అవకాశాలు రిటైలర్లు అందిపుచ్చుకోవడానికి అవసరమైన సొల్యూషన్లను అందించడానికి జఫెరా కొనుగోలు తమకు దోహదపడుతుందని డిసౌజా పేర్కొన్నారు.
ఇక కాగ్నిజెంట్ గురించి చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా 50 డెలివరీ సెంటర్స్, ఉద్యోగులు విషయానికి వస్తే సుమారుగా లక్షవరకు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఈ కంపెనీని కొనుగోలు రాబోయే కాలంలో కాగ్నిజెంట్ మరింత అభివృద్దికి దోహాదపడుతుందని అన్నారు. జఫెరా ఎల్‌ఎల్‌సి కంపెనీని ఎంతకు కొనుగోలు చేశారనే విషయం మాత్రం ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications