లగడపాటి! నీ భార్యలందరినీ ఒకే ఇంట్లో పెట్టు: కెటిఆర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమాన్ని హింస వైపు మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఆయన రెచ్చగొట్టే ప్రయత్నాలు మానకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అరెస్టులు చేయించడం ఎంత వరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణలోని వాస్తవ పరిస్థితి నివేదికను కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె కారణంగా అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడిపించడం వల్ల అమాయకుడు ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముకుంటే అంతే సంగతులు అన్నారు. వారికి అవ్వకావాలో బువ్వ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. చేతనైతే పదవులకు రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాలని అంతేకాని డిమాండ్లు పెట్టి రాజీనామాలు చేస్తానంటే దానినెవరూ నమ్మరన్నారు.












Click it and Unblock the Notifications