పులివెందులలో టిడిపి హల్‌చల్, సతీష్ రెడ్డి అరెస్టు

Telugudesam
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయిన పులివెందులలో బుధవారం తెలుగుదేశం పార్టీ బందుతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ బుధవారం పులివెందుల బందుకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టణంలోని వీధులలో తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలను బలవంతంగా మూసి వేయించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, టిడిపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బందులో భాగంగా పులివెందుల ఆర్టీసి బస్సు స్టాండ్ దగ్గర శాసనసమండలి సభ్యుడు సతీష్ రెడ్డితో సహా పలువురు టిడిపి కార్యకర్తలు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అనుమతి లేకుండా బందు నిర్వహించడాన్ని ప్రశ్నించారు. బందుకు అనుమతి లేదని చెప్పి సతీష్ రెడ్డి సహా పలువురిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+