వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కోమటిరెడ్డిపై చెప్పులు, 1న రాజీనామాకు హామీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komati Reddy Venkat Reddy
నల్గొండ: పార్టీ అధిష్టానం ఈ నెలాఖరులోగా తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే అక్టోబరు 1వ తారీఖున తాను తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశంలో చెప్పారు. 1న రాజీనామా చేస్తానని గతంలోనే ప్రకటించిన కోమటిరెడ్డి బుధవారం కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 1న గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇస్తానని 2వ తారీఖున లక్ష మంది కార్యకర్తలతో దీక్షకు దిగుతానని చెప్పారు. 3న ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానన్నారు. కోమటిరెడ్డి దీక్షకు ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం మద్దతు పలికారు. అయితే దీక్షను ఒకే రోజుకు పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మంత్రి తెలంగాణ ఉద్యోగ జెఏసి దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చినప్పుడు రసాభాసగా మారింది. వేదికపైకి ఎక్కి మంత్రి ప్రసంగిస్తుండగా ఉద్యోగ జెఏసి నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రాజీనామా చేసి రావాలని డిమాండ్ చేశారు. పలువురు తెలంగాణవాదులు వేదిక పైకి చెప్పులు విసిరారు. దీంతో ఆయన వేదిక దిగి రాక తప్పలేదు. కాగా అంతకుముందు కోమటిరెడ్డి సోదరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

English summary
Telanganites thrown chappal at Minister Komatireddy Venkat Reddy today in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X