వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్‌మెన్‌ను సరెండర్ చేసిన తెలంగాణ కాంగ్రెసు ఎంపిలు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshava Rao and Ponnam Prabhakar
హైదరాబాద్: కాంగ్రెసుకు చెందిన ఎనిమిది మంది తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ గన్‌మెన్‌ను సరెండర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆఫీసర్ల సంఘం ఆధ్యక్షుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు గన్‌మెన్‌ను సరెండర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కె. కేశవరావు సహా ఎనిమిది కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, డిజిపి దినేష్ రెడ్డికి బుధవారం సాయంత్రం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఇప్పటికే తమ గన్‌మెన్‌ను సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాము ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో లాగా వ్యవహరించాల్సి వస్తుందని, అప్పుడు రాజకీయ నాయకులు వీధుల్లోకి రాలేరని చలపతిరావు ఇటీవల అన్నారు. దీనిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తీవ్రంగా స్పందించి గన్‌మెన్‌ను సరెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, శాసనసభ్యుడు రాజయ్య పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. ముఖ్యమంత్రికి, హోం మంత్రికి చెప్పినా చలపతిరావుపై చర్యలు తీసుకోలేదని, అందుకే గన్‌మెన్‌ను వెనక్కి పంపించాలని నిర్ణయించుకున్నామని పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమను ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికార ప్రతినిధి రేణుకా చౌదరిపై తాము బొత్సకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రేణుకా చౌదరి అహంకారిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. విపక్షాలను విమర్శించాల్సిన రేణుకా చౌదరి సొంత పార్టీవారినే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రైల్ రోకో సందర్భంగా తమపై పెట్టిన కేసుల గురించి బొత్సకు చెప్పినట్లు ఆయన తెలిపారు.

English summary
Congress Telangana MPs have decided to surrender gunmen protesting Chalapathi Rao' comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X