డిఎస్ ఎంపిక, తెలంగాణ ప్రక్రియకు అనుకూలం?

Saraiah
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎంపిక చేయడాన్ని పార్టీ తెలంగాణ నాయకులు తెలంగాణకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభించింది కాబట్టే ఎమ్మెల్సీగా డి. శ్రీనివాస్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని తెలంగాణకు చెందిన మంత్రి సారయ్య వ్యాఖ్యానించారు. అయితే, ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిఎస్ ఎంపికకు తెలంగాణవాదానికి సంబంధం లేదని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీగా ఎంపికైన డి. శ్రీనివాస్‌ను వారు సోమవారం అభినందించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డి. శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెసు పార్టీని శ్రీనివాస్ అధికారంలోకి తెచ్చారని ఆయన కొనియాడారు.

డిఎస్ సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం శాసనమండలికి ఎంపిక చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి డిఎస్ తన సహాయ సహకారాలు అందిస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై డిఎస్ అధిష్టానానికి తగిన సలహాలు ఇస్తుందని ఆయన అన్నారు. రెండు సార్లు పార్టీ అధికారంలోకి తేవడానికి డిఎస్ సమన్వయం సాధించి కృషి చేశారని తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అనుభవం ఉన్న నాయకుడిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ఆయన పార్టీ అధిష్టానానికి కృతజ్ఢతలు చెప్పారు.

ముఖ్యమంత్రి పదవికి డిఎస్ పోటీకి రాబోరని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసి రెండు సార్లు పార్టీని అధికారంలోకి తేవడంలో డిఎస్ కృషి చాలా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిఎస్ ఎంపికను అందరూ కలిసి ఆహ్వానించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. డిఎస్ ఎంపికకు తెలంగాణవాదానికి సంబంధం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+