లొంగుబాటుకు గడాఫీ కుమారుడి సుముఖత

Muammar Gaddafi
ట్రిపోలీ: పోరాటం చేస్తూ లిబియా గడ్డ మీద ప్రాణాలు విడుస్తానని శపథం చేసిన సైఫ్ ఆల్ - ఇస్లామ్ గఢాఫీ లొంగుబాటుకు సిద్ధపడ్డాడు. అంతర్జాతీయ కోర్టు ముందు తాను లొంగిపోతానని విజ్ఞప్తి చేసుకున్నాడు. లిబియా నియంత మౌమ్మార్ గడాఫీ ఎనిమిది సంతానంలో సైఫ్ ఆల్ - ఇస్లామ్ ఒక్కడే జీవించి ఉన్నాడు. తన తండ్రికి పట్టిన గతి తనకు పట్టకుండా లొంగిపోవడానికి సైఫ్ ఆల్ - ఇస్లామ్ గఢాఫీ సిద్ధపడినట్లు పాలక నేషనల్ ట్రాన్షినల్ కౌన్సిల్ (ఎన్‌టిసి) అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు లొంగిపోవడానికి అతను సంసిద్ధత వ్యక్తం చేశాడు. యుద్ధ నేరం కింద కోర్టు అతనిపై అభియోగం మోపింది.

ముప్పయి తొమ్మిదేళ్ల సైఫ్ ఆల్ ఇస్లామ్ లొంగుబాటుతో లిబియాలో నాలుగు దశాబ్దాల గఢాపీ కటుంబ పాలన మరో మలుపు తిరుగుతుంది. ఇస్లామ్ గఢాఫీకి అత్యంత ప్రియమైన కుమారుడు. గఢాఫీ తన వారసుడిగా అతని పేరే చెప్పేవాడు. తన బంధువుతో కలిసి డచ్‌కు చెందిన ఐసిసి ముందు లొంగిపోవడానికి సైఫ్ ఆల్ ఇస్లామ్ కోరుకుంటున్నాడు. హేగ్ ముందు తమను తాము సమర్పించుకోవడానికి సిద్ధపడుతున్నారని ఎన్‌టిసి అధికారి అబ్దెల్ మజీద్ మ్లేగ్తా చెప్పారు. సైఫ్ ఆల్ ఇస్లామ్ లిబియాలోని దక్షిణాది ఎడారిలో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+