షూటింగులో హీరోయిన్ శ్రియకు తెలంగాణ సెగ

శ్రియ ఎక్కిన వ్యాన్‌ను చుట్టుముట్టి జై తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో శ్రియ వ్యాన్ దిగి విద్యార్థులతో కలిసి చేయేత్తి జై తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో విద్యార్థులు శాంతించారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తమను షూటింగ్ చేసుకోనివ్వాలని సినీ యూనిట్ చెప్పినా విద్యార్థులు వినలేదు. విద్యార్థులు షూటింగును అడ్డుకోవడంతో సినీ యూనిట్ తీవ్ర అసంతృప్తికి గురైంది. విద్యార్థులు శ్రియ కారుపై దాడి చేసినట్లు చెబుతున్నారు.
తాను భారతదేశంలో ఉన్నానని, తనకు ఎక్కడైనా తిరిగి అధికారం ఉందని శ్రియా తనపై దాడి జరిగిన అనంతరం ట్విట్టర్‌లో అన్నారు. తన కారుపై దాడి జరిగిందని, తన తలకు ఓ రాయి తగిలిందని, అయితే తనకు ఏ విధమైన ప్రమాదం జరగలేదని ఆమె రాసింది. తనకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, భద్రత లేదా అని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications