హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గతంలో లేని విధంగా అభివృద్ధి: సదస్సులో సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం హైదరాబాదులో ప్రారంభమైన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో అన్నారు. గతంలో కంటే పలు అభివృద్ధి పథకాలు ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆర్థిక పురోగతి సాధించేందుకు అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక పురోగతి సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందన్నారు.

మౌలిక వసతుల కల్పనలో పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం సహాయకారిగా పని చేస్తుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఆనంద శర్మ, 42 దేశాలకు చెందిన రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.5.55 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy commented on state development in international participation summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X