వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలక్ష్మి పిటిషన్ వాయిదా, ప్రత్యూష కేసులో నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilaxmi
న్యూఢిల్లీ: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ విచారణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21వ తేదికి వాయిదా వేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీలక్ష్మి సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇది సోమవారం విచారణకు వచ్చింది. కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉందని, సాక్ష్యాధారాల సేకరణ జరుగుతోందని ఇలాంటి సమయంలో శ్రీలక్ష్మికి బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ తరఫు న్యాయవాది కోరారు. శ్రీలక్ష్మిపై ఛార్జీషీట్ నమోదు చేయడానికి తమకు పదిహేను రోజుల సమయం కావాలన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విచారణనను వాయిదా వేశారు. పదిహేను రోజుల్లో ఛార్జీషీట్ పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించారు. గడువులోగా ఛార్జీషీట్ కోర్టుకు సమర్పించాలని, దానిని పరిశీలించాక విచారణ చేపడతామన్నారు.

ఎమ్మార్ వ్యవహారంలో సిబిఐ విచారణను సవాల్ చేస్తూ ఎమ్మార్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వివరాల సమర్పించేందుకు తమకు నాలుగు వారాలు గడువు కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. కాగా సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు తనకు విధించిన శిక్షను తగ్గించాలని సిద్ధార్థ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై కోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సిద్ధార్థ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది.

English summary
Supreme Court adjourned Srilaxmi bail petition hearing to February 21st.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X